Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bhogapuram Airport | ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధానితో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్‌, కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, ఇతర ప్రముఖులు, జీఎంఆర్‌ గ్రూపు ఛైర్మన్ జి. మల్లిఖార్జున రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఆధునిక సదుపాయాలను ప్రధాని మోదీ పరిశీలించారు. చెక్-ఇన్ హాల్, ఎయిర్‌పోర్ట్ డిజైన్, టెక్నికల్ ప్రత్యేకతలను జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు.

Bhogapuram Airport | ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్యం..

విమానాశ్రయ ప్రారంభోత్సవంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్వహించిన థింసా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు సహా మొత్తం 13,750 మంది ఈ నృత్యంలో పాల్గొని ప్రధానికి అద్భుత స్వాగతం పలికారు. ప్రయాణికుల టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై ఈ ప్రదర్శన సాగింది. ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్తున్నంతసేపు ప్రధాని మోదీ ఈ నృత్యాన్ని తిలకించి అభినందించారు.

ఇది కూడా చదవండి..: IBPS Clerk Recruitment | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *