Pawan Kalyan on Modi | ప్రధాని మోదీ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరం: పవన్ కల్యాణ్

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pawan Kalyan on Modi | దేశాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశం కోసం కష్టపడేవారికే ఇదేనా మనం ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. తనను తిట్టిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమించిన ప్రధాని మోదీ గొప్పతనాన్ని చూశాక ఆయన పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తోందని తెలిపారు. నేటి యువతకు తల్లిదండ్రులు సరైన సంస్కారం నేర్పించాలని పిలుపునిచ్చారు.

Pawan Kalyan on Modi | రామకార్యం లాంటి దేశ పరిపాలన..

దేశాన్ని నడిపించడం అనేది రామకార్యం లాంటి బృహత్కార్యమని, ఏమాత్రం సెలవు తీసుకోకుండా నిరంతరం శ్రమిస్తున్న ప్రధానికి మనం ఏమివ్వగలం అని పవన్ అన్నారు. పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలు తగిలినట్లు, దేశం కోసం కష్టపడుతున్న మోడీపైనే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్న మోడీని మించిన నాయకుడు మరొకరు లేరని స్పష్టం చేశారు.

Pawan Kalyan on Modi | మీరు వద్దు అనుకునే వరకు అధికారంలో ఉండాలి:

ప్రధాని మోదీ స్వయంగా తనంతట తానే అధికారం వద్దు అనుకుంటే తప్ప, అప్పటి వరకు దేశ పరిపాలన పగ్గాలు ఆయన చేతుల్లోనే ఉండాలని, అందుకు తామంతా అండగా ఉంటామని పవన్ తేల్చిచెప్పారు. దేశం కోసం పనిచేసే వ్యక్తికి అండగా నిలబడితే ఏ స్థాయి అభివృద్ధి జరుగుతుందో భోగాపురం ఎయిర్‌పోర్ట్టే నిదర్శనమన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోదీ సాకారం చేస్తున్నారని ప్రశంసించారు. తెలుగు జాతి ఎవరికీ తలవంచదని అల్లూరి సీతారామరాజు గర్జించారని గుర్తు చేస్తూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి సరికొత్త అధ్యాయం అవుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Anantapur School Hostel | అనంతపురం జిల్లాలో దారుణం.. బ్లేడుతో తోటి విద్యార్థినులపై దాడి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *