అంతర్జాతీయంWhite House Shooting | వైట్​హౌస్​లో కాల్పుల కలకలం.. ట్రంప్​ తరలింపు!

White House Shooting | వైట్​హౌస్​లో కాల్పుల కలకలం.. ట్రంప్​ తరలింపు!

అగ్రరాజ్యం అమెరికా రాజధానిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్​ హౌస్​లో కాల్పుల ఘటన కలకలం రేపింది...

అక్షరటుడే, వెబ్​డెస్క్: White House Shooting | అమెరికా రాజధాని Washington, D.C.లోని White Houseలో జరిగిన డిన్నర్ కార్యక్రమం సమయంలో అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిల్టన్ బాల్‌రూమ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 2,600 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం.

White House Shooting | సురక్షితంగా తరలింపు..

కాల్పుల ఘటనతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, అధ్యక్షుడు Donald Trump, ఫస్ట్ లేడీ Melania Trumpలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అలాగే ఉపాధ్యక్షుడు JD Vanceతో పాటు పలువురు కీలక నేతలను కూడా వెంటనే భద్రతా వలయంలోకి తీసుకెళ్లారు.

కాల్పుల శబ్దంతో అప్రమత్తమైన Central Intelligence Agency (సీఐఏ) ఏజెంట్లు, సీక్రెట్ సర్వీస్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పూర్తిగా చుట్టుముట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రాణభయంతో కొంతమంది అతిథులు టేబుళ్ల కింద దాక్కుని రక్షణ పొందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Trump India Remarks

White House Shooting | ట్రంప్​ స్పందన..

భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతని ఉద్దేశ్యం ఏమిటి.. ఈ ఘటనకు కారణాలు ఏమిటి.. అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘటనలో పెద్దగా ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. అయితే, భద్రతా వ్యవస్థలో లోపాలపై విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఘటనతో అమెరికాలో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ మొదలైంది.

కాగా, తాజా ఘటనపై ట్రంప్​ స్పందించారు. ఆపత్కాలంలో భద్రతా సిబ్బంది వేగంగా స్పందించారు. పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకొచ్చిన అధికారులను ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: Bugatti Chiron Speed | గంటకు 414 కి.మీ వేగం.. ఎలాంటి జరిమానా లేకుండా దూసుకుపోయిన Bugatti Chiron!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....