అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vida VX2 Go FB | హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా దేశీయ మార్కెట్ (Domestic Market)లో మరో వేరియంట్ స్కూటర్‌ను పరిచయం చేసింది. వీఎక్స్ 2 లైనప్‌లో తాజాగా గో ఎఫ్బీ పేరుతో లాంచ్ చేసిన ఈ స్కూటర్ 128 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కాగా ఈ లైనప్‌లో తొలిసారిగా రిమూవబుల్ బ్యాటరీలకు బదులుగా ఫిక్స్డ్ బ్యాటరీ అమర్చారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.13 లక్షలు. ఈనెలలోనే డెలివరీ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Vida VX2 Go FB | 3.1కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ..
3.1 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల ఫిక్స్డ్ లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇంట్లో నేరుగా ప్లగ్ ఇన్ చేసి చార్జ్ చేసుకునే విధంగా ఈ బ్యాటరీని రూపొందించారు.
బ్యాటరీని ఫుల్ చార్జి చేస్తే 128 కిలోమీటర్ల (ఐడీసీ రేంజ్) వరకు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది.
Vida VX2 Go FB | 65 నిమిషాల్లోనే చార్జింగ్..
డీసీ ఫాస్ట్ చార్జర్‌తో 65 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
Vida VX2 Go FB | టాప్ స్పీడ్ 70 కిలోమీటర్లు..
వీఎక్స్ 2 గో ఎఫ్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌కు 6 కేడబ్ల్యూ మోటార్ జత చేశారు. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు.
ఇతర ఫీచర్లు : 4.3 అంగుళాల ఎల్సీడీ కన్సోల్‌తో వచ్చింది. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో టర్న్ బై టర్న్ నావిగేషన్ ను సపోర్ట్ చేస్తుంది.
సీటు కింద ఉండే స్టోరేజ్ సామర్థ్యం 27.2 లీటర్లు ఉంది. ఇందులో హెల్మెట్‌తోపాటు ఇతర సామగ్రిని కూడా ఉంచొచ్చు.
పొడవైన సింగిల్ పీస్ సీటు వల్ల రైడర్‌తో పాటు వెనుక కూర్చునే ప్రయాణికుడికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి..: OnePlus Nord N6X | మార్కెట్లోకి వన్ ప్లస్ ఎన్ 6ఎక్స్ .. ఆగస్టు 4 నుంచి సేల్ ప్రారంభం
I want to know the price