TNGOs Bonalu | 5న టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో బోనాలు

టీఎన్జీవోస్​ నిజామాబాద్​ ఆధ్వర్యంలో ఈనెల 5న బోనాల పండుగను నిర్వహించనున్నట్లు ఎంప్లాయీస్​ జేఏసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమాన్ కుమార్​ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: TNGOs Bonalu | టీఎన్జీవోస్​ నిజామాబాద్​ (Nizamabad) ఆధ్వర్యంలో ఈనెల 5న బోనాల పండుగను నిర్వహించనున్నట్లు ఎంప్లాయీస్​ జేఏసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమాన్ కుమార్​ తెలిపారు. ఈ మేరకు ఆయన టీఎన్జీవోస్​ భవన్​లో మాట్లాడారు.

TNGOs Bonalu | పాత కలెక్టరేట్​ మైదానం నుంచి..

నాశెట్టి సుమన్​కుమార్​ మాట్లాడుతూ.. 5వ తేదీన ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభాస్థలి నుండి బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం అక్కడి నుండి బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి, పాత కలెక్టరేట్​ ఆలయ ఆవరణలో నవదుర్గామాతకు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తామని వివరించారు. అనంతరం మహా అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​​కుమార్​ గౌడ్​, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్​రెడ్డి, షబ్బీర్​అలీ, ఎమ్మెల్యేలు ధన్​పాల్, భూపతిరెడ్డి, మేయర్​ ఉమారాణి, కలెక్టర్​, సీపీ, మాజీ మేయర్​లకు ఆహ్వాపత్రాలు అందజేశామని వివరించారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Flood Rescue | వరద నీటిలో నిలిచిపోయిన పెళ్లి బస్సు.. రక్షించిన పోలీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *