Udhayanidhi Stalin Bail | ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. స్టేషన్‌ బెయిల్‌ మంజూరు

ఉదయనిధి స్టాలిన్​కు కోర్టులో ఊరట లభించింది. ఆయన స్టేషన్​ బెయిల్​ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Udhayanidhi Stalin Bail | తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్​కు కోర్టులో ఊరట లభించింది. ఆయన స్టేషన్​ బెయిల్​ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉదయనిధి సోమవారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. సీఎం విజయ్​, సినీనటి త్రిష (Actress Trisha)పై డబల్​ మీనింగ్​ వ్యాఖ్యలు చేశారు. దీంతో టీవీకే శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో తంజావూరు పోలీసులు మంగళవారం ఉదయం ఉదయనిధిని అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

Udhayanidhi Stalin Bail | బెయిల్​ పిటిషన్​పై విచారణ

అరెస్ట్​కు ముందే ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్​ కోసం మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్‌కు సూచించింది. కస్టడీలో ఉంచే ఉద్దేశం లేదని ఏజీ హైకోర్టుకు తెలిపారు. విచారణ తర్వాత విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ అరెస్టు మహిళల ప్రయోజనాల దృష్ట్యా జరిగిందని పేర్కొన్నారు.
అదుపులోకి తీసుకున్న తర్వాత విలేకరులతో మాట్లాడిన ఉదయనిధి, తాను ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఖండించారు. తన ప్రసంగానికి సంబంధించిన ఎడిట్ చేసిన క్లిప్‌లను ప్రచారం చేయడం ద్వారా ఒక తప్పుడు కథనాన్ని సృష్టించారని ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడే రకం మనిషిని కాదన్నారు.

ఇది కూడా చదవండి..: Udhayanidhi Stalin Arrest | చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత.. ఉదయనిధి అరెస్ట్‌పై డీఎంకే ఫైర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *