అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jharkhand Student Protests | జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. JPSC, JSSC CGL ఇతర పోటీ పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో నిరాహార దీక్ష చేస్తున్నారు.
మహతోతో బుధవారం సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దేవేంద్ర నాథ్ మహతో మాట్లాడుతూ.. తాము జూలై 25 నుండి సత్యాగ్రహం చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 2న నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించానని చెప్పారు. ఇక్కడ 26 ఏళ్లుగా పరీక్షా పత్రాలు లీక్ అవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) మాట్లాడుతూ.. నీళ్లు తాగాలని మహతోకు సూచించారు.
Jharkhand Student Protests | మద్దతు తెలిపిన సీజేపీ
జార్ఖండ్‌లో విద్యార్థుల ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు తెలిపింది. బుధవారం అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా మేము జార్ఖండ్‌కు వెళ్తాం. అక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా ఉంటాము. వారి ప్రతి డిమాండ్‌కు మద్దతు ఇస్తామని తెలిపారు. ప్రజలు తమ సొంత భావజాలాలు, రాజకీయ పార్టీల పరిధులకతీతంగా ఏకమై, మన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే అంశాలకు వ్యతిరేకంగా పోరాడటం వల్లే వారి ఉద్యమం విజయవంతమైందన్నారు. నేడు భారతదేశానికి ఒక ప్రజా ఉద్యమం అవసరం అని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Meta Ultimatum | ప్రధాని వీడియో తొలగింపు అంశం..మెటాకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం