అక్షరటటటటుడే వెబ్‌డెస్క్: Airtel Recharge Plan | ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. రూ.299 విలువైన ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తొలగించింది. 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, డేటా అందించే ఈ పాపులర్ ప్లాన్‌కు ఎయిర్‌టెల్ గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం తమ అధికారిక వెబ్‌సైట్, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుంచి ఈ ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది.
Airtel Recharge Plan | కొత్తగా రీఛార్జ్ చేయాలంటే..
గతంలో రూ.299 ప్లాన్ కింద 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, ఫ్రీ కాలర్ ట్యూన్స్, పెర్‌ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్ లభించేవి. ఈ ప్లాన్ రద్దు కావడంతో.. ఇకపై ఎయిర్‌టెల్‌లో అత్యంత కనిష్ట రీఛార్జ్ ప్లాన్ ధర రూ.349కి చేరింది. ఈ రూ.349 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, ఆరు నెలల యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
Airtel Recharge Plan | మరికొన్ని ప్లాన్ల తొలగింపు..
ఎంట్రీ లెవెల్ ప్లాన్‌తో పాటు రూ.579, రూ.619 విలువైన రీఛార్జ్ ప్లాన్‌లను కూడా ఎయిర్‌టెల్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. రూ.579 ప్లాన్ ద్వారా 56 రోజుల పాటు, రూ.619 ప్లాన్ ద్వారా 60 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా ప్రయోజనం లభించేది. ప్రస్తుతం ఈ రెండు ప్యాక్స్ కూడా వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. మొదట కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలో తొలగించిన సంస్థ, క్రమంగా అన్ని ప్రాంతాల్లోనూ వీటిని నిలిపివేసినట్లు సమాచారం.
–> ఎయిర్‌టెల్ రూ.299 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్‌ను తొలగింపు
–> 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ.299 ప్లాన్‌ను వెబ్‌సైట్, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుంచి తొలగించిన ఎయిర్‌టెల్
–> రూ.299 ప్లాన్‌లో రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలు అందుబాటులో ఉండేవి
–>… pic.twitter.com/9teoRP7ANX
— RTV (@RTVnewsnetwork) August 5, 2026
ఇది కూడా చదవండి: Kamareddy Roads | రోడ్డెక్కితే నరకం.. గుంతల రోడ్లతో జనం విలవిల..