అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 07 Market Analysis | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కీలక హర్ముజ్ జలసంధి(Strait of Hormuz) గుండా శత్రు దేశాలైన యూఎస్, ఇజ్రాయెల్ తదితర దేశాల నౌకలు వెళ్లకుండా నిషేధించే బిల్లును ఇరాన్ (Iran) పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత సెషన్లో యూఎస్ మార్కెట్లు నష్టాలతో.. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నాయి.
Aug 07 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
జూలై జాబ్ డేటా వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో గత సెషన్లో నాస్డాక్ 0.06 శాతం, ఎస్ అండ్ పీ 0.18 శాతం నష్టపోగా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.15 శాతం నష్టంతో ఉంది.
Aug 07 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.19 శాతం నష్టపోగా, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.35 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.05 శాతం లాభపడ్డాయి.
Aug 07 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.31 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.17 శాతం లాభంతో ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ 0.98 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.96 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.15 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.05 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.39 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 18 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
డీఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 4,013 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలహీనపడి 95.22 వద్ద ఉంది.
యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.95 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.68 వద్ద ఉన్నాయి.
నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.91 నుంచి 1.04 కు పెరిగింది.
విక్స్ 0.81 శాతం పెరిగి 12.16 వద్ద ఉంది.
క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 83.22 డాలర్ల వద్ద ఉంది.