China Rocket Explosion | ప్రయోగంలో భారీ వైఫల్యం..85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్!

ప్రయోగం ఎందుకు విఫలమైందన్న దానిపై చైనా అంతరిక్ష సంస్థలు సాంకేతిక పరిశీలన చేపట్టే అవకాశం ఉంది. రాకెట్‌ మొదటి దశలో తలెత్తిన సమస్యకు కారణాలను విశ్లేషించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: China Rocket Explosion | చైనా చేపట్టిన అంతరిక్ష ప్రయోగంలో భారీ వైఫల్యం చోటుచేసుకుంది. లాంగ్ మార్చ్‌ 7A (CZ-7A) రాకెట్‌ ప్రయోగించిన కేవలం 85 సెకన్లకే పేలిపోయింది.

హైనాన్‌లోని వెంచాంగ్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ మొదటి దశలోనే సమస్య తలెత్తడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

Colombia Earthquake | కొలంబియాను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనలు.. 20 మంది దుర్మరణం

ప్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే రాకెట్‌లో సాంకేతిక లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది. అనంతరం భారీ శబ్దంతో రాకెట్‌ పేలిపోయింది. దీంతో ప్రయోగం పూర్తిగా విఫలమైంది.

China Rocket Explosion | జియోస్టేషనరీ కక్ష్య కోసం..

లాంగ్ మార్చ్‌ 7Aను చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ప్రధానంగా ఉపగ్రహాలను జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌ (GTO)లోకి ప్రవేశపెట్టేందుకు ఈ రాకెట్‌ను రూపొందించారు.

చైనా అంతరిక్ష ప్రయోగ కార్యక్రమంలో CZ-7Aకు కీలకమైన స్థానం ఉంది. అయితే తాజా ఘటనతో ఈ ప్రయోగ వాహనం పనితీరుపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.

China Rocket Explosion | రెండోసారి విఫలం

ఇప్పటివరకు లాంగ్ మార్చ్‌ 7Aతో మొత్తం 18 ప్రయోగాలు చేపట్టినట్లు సమాచారం. తాజా ఘటనతో కలిపి ఈ రాకెట్‌ ప్రయోగాల్లో వైఫల్యాల సంఖ్య రెండుకు చేరింది.

ప్రయోగం ఎందుకు విఫలమైందన్న దానిపై చైనా అంతరిక్ష సంస్థలు సాంకేతిక పరిశీలన చేపట్టే అవకాశం ఉంది. రాకెట్‌ మొదటి దశలో తలెత్తిన సమస్యకు కారణాలను విశ్లేషించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ ఘటనతో చైనా అంతరిక్ష కార్యక్రమంలో ప్రయోగాల భద్రత, రాకెట్‌ విశ్వసనీయతపై మరోసారి చర్చ మొదలైంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *