Aug 11 Horoscope | తల్లిదండ్రుల నుంచి ఊహించని సాయం.. ఇక ఈ రాశుల వారి ఆర్థిక కష్టాలకు చెక్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 11 Horoscope | గ్రహాల గమనం వలన ఇవాళ (మంగళవారం, ఆగస్టు 11) ద్వాదశ రాశుల వారికి మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలగడంతో పాటు ఆఫీసులో శత్రువులు మిత్రులుగా మారే యోగం ఉంది.

వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు, పాత అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తాయి. ఉద్యోగంలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారు, అయితే ఖర్చులు, తనిఖీల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి.

పాత పెట్టుబడుల ద్వారా ఊహించని ధనలాభం అందుతుంది. మహిళల సహకారంతో విజయం లభిస్తుండగా, సృజనాత్మక రంగంలో ఉన్నవారు మంచి పేరు, గుర్తింపు సాధిస్తారు. విదేశీ వ్యాపారాల ద్వారా కూడా అనుకూల లాభాలు అందుతాయి.

Aug 11 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Aug 11 Horoscope | సానుకూల ఆలోచనలు, మీ మేధాశక్తితో ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమిస్తారు. తల్లిదండ్రుల సహాయం అందడంతో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటికి కావలసిన వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు చేసే మంచి పని వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.

వృషభ రాశి: Aug 11 Horoscope | ఇతరులకు చేసే సహాయం వల్ల స్నేహితుల నుండి ప్రశంసలు అందుతాయి. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపార పనులపై బయటకు వెళ్లేవారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దొంగతనాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను మీ అనుభవంతో చాలా తేలికగా పరిష్కరిస్తారు.

మిథున రాశి: Aug 11 Horoscope | దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇవాళ మీకు చాలా అనుకూలమైన రోజు. అనేక మార్గాల నుంచి ఆర్థిక లాభాలు అందుతాయి. ఆఫీసులో చాలా రోజులుగా వేధిస్తున్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపడానికి సమయం దొరుకుతుంది.

కర్కాటక రాశి: ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తులో మంచి విలువ పెరిగే ఆస్తులు లేదా వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆఫీసులో వాతావరణం మీకు పూర్తి సానుకూలంగా ఉంటుంది. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు, బహుమతులు లభిస్తాయి. ఇంటి విషయాలు కొంత ఆందోళన కలిగిస్తాయి.

సింహ రాశి: Aug 11 Horoscope | డబ్బు కొరత లేదా ఆర్థిక సమస్యల వల్ల కొన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. సహాయం కోరి వచ్చిన వారి పట్ల ఉదారంగా వ్యవహరిస్తారు. సమాజానికి మేలు చేసే పనులపై దృష్టి పెడతారు. ఉద్యోగులకు ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి.

Nizamabad Drone Surveillance | డ్రోన్‌ నిఘా.. అనుమానాస్పద ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

కన్యా రాశి: Aug 11 Horoscope | జీవితం సాఫీగా, స్థిరంగా సాగాలంటే ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. పనిలో సహోద్యోగులు సహాయం చేస్తారు. కుటుంబంతో కలసి పిక్నిక్ లేదా సరదాగా బయటకు వెళ్లడానికి కేటాయిస్తారు.

తులా రాశి: Aug 11 Horoscope | అనుకోకుండా ఖర్చులు పెరగడం వల్ల కొంత మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. మీరు ఇచ్చే పార్టీలు లేదా ఈవెంట్లలో అందరినీ కలుపుకుని పోతారు. మీరు హాజరయ్యే వేడుకల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రశాంతత కోసం దూర ప్రదేశాలకు వెళ్తారు.

వృశ్చిక రాశి: Aug 11 Horoscope | ఎంతటి కష్టమైన పరిస్థితినైనా సులువుగా మీ నియంత్రణలోకి తెచ్చుకుంటారు. ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు. రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. కొత్త ప్రాజెక్ట్‌లకు అవసరమైన నిధులు సమకూరుతాయి.పోస్ట్ ద్వారా వచ్చే ఒక వార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది.

ధనుస్సు రాశి: గతంలో ఇతరుల సలహాతో చేసిన పెట్టుబడుల ద్వారా ఇవాళ అనుకోకుండా మంచి ఆర్థిక లాభాలు అందుతాయి. బంధువులు, స్నేహితుల నుంచి అనుకోని బహుమతులు లేదా కానుకలు అందుతాయి. కొందరికి పార్ట్-టైమ్ ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.

మకర రాశి: జీవితం ప్రశాంతంగా, స్థిరంగా సాగాలంటే ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా, మెలకువగా ఉండాలి. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ, మీ విజయంలో మహిళల పాత్ర కీలకమవుతుంది. చుట్టుపక్కల వారి సహాయంతో సంతోషంగా ఉంటారు. సానుకూల దృక్పథం కలిగిన మంచి మిత్రులతో సమయం గడపుతారు.

కుంభ రాశి: డబ్బు కొరత వల్ల కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోవచ్చు. కానీ కష్టసమయంలో ఒక బంధువు మీకు తోడుగా నిలుస్తారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలమైన రోజు. వీరికి చిరకాలంగా ఎదురుచూస్తున్న పేరు, గుర్తింపు లభిస్తాయి. పట్టుదలతో కష్టపడితే విజయం సాధిస్తారు.

మీన రాశి: విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు అందుతాయి. ఉద్యోగులు ఆఫీసులో తమ ప్రతిభను చాటుకుంటారు. మీ పోటీ తత్వంతో అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామి ఆనారోగ్యం కారణంగా కొంత ఆందోళన కలిగిస్తుంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *