Srivani Darshan Tickets | శ్రీవాణి దర్శన టికెట్ల ఎఫెక్ట్.. తిరుపతి విమాన టికెట్ ధరలకు రెక్కలు!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srivani Darshan Tickets | తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) దర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ప్రభావం ఇప్పుడు విమాన ప్రయాణాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి రేణిగుంట (Renigunta) విమానాశ్రయానికి వచ్చే విమానాల టికెట్ ధరలు రోజురోజుకీ పెరుగుతూ ప్రయాణికులకు భారంగా మారుతున్నాయి.

ప్రస్తుతం టీటీడీ (TTD) రేణిగుంట విమానాశ్రయంలో రోజుకు 200 శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తోంది. అయితే ఈ టికెట్లు ఉదయం మొదటి విమానంతో వచ్చే ప్రయాణికులే ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో, ఆ ఫ్లైట్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఫ్లైట్ల టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Srivani Darshan Tickets | భారీగా రేట్లు

సాధారణంగా 3 నుండి 7 వేల‌ రూపాయల్లో లభించే టికెట్లు, ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉండే రోజుల్లో రెండు నుంచి మూడు రెట్లు పెరిగి విక్రయమవుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్లు, పండుగలు, ప్రత్యేక దినాల్లో ఈ ధరలు మరింత పెరుగుతున్నాయి. శ్రీవాణి (Srivani) టికెట్లు పొందాలంటే ఉదయం విమానంలోనే చేరుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో భక్తులు అధిక ధరలు చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ పరిస్థితి సాధారణ భక్తులకు ఇబ్బందులను కలిగిస్తోంది. అధిక ధరల కారణంగా చాలా మంది విమాన ప్రయాణాన్ని వదిలేసి రైలు లేదా రోడ్డు మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోంది. మరోవైపు విమానయాన సంస్థలు ఈ పెరిగిన డిమాండ్‌ను ఉపయోగించుకుంటూ ధరలను పెంచుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Srivani Darshan Tickets | టీటీడీ చర్యలు

ఈ సమస్యను గుర్తించిన టీటీడీ, శ్రీవాణి టికెట్ల జారీని విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో కూడా రోజుకు 100 టికెట్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రేణిగుంటపై ఒత్తిడి తగ్గి, విమాన టికెట్ ధరలు కొంతవరకు స్థిరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఆలయాల (Temples) నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తం 5 వేల దేవాలయాలను వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నిర్మాణ పనులను సమర్థంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీవాణి దర్శన టికెట్లకు పెరుగుతున్న డిమాండ్ వల్ల విమాన టికెట్ ధరలు పెరగడం భక్తులకు భారంగా మారింది.

tirupati

దీనిని కూడా చదవండి : Amaravati BITS | అమరావతిలో బిట్స్ పిలానీ ‘ఏఐ క్యాంపస్’.. 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *