Manmohan Singh Case | మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ చారిత్రాత్మకం: సోనియా గాంధీ

బొగ్గు బ్లాకుల కేటాయింపుల కుంభకోణం కేసులో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సీబీఐ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించడం చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభివర్ణించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Manmohan Singh Case | బొగ్గు బ్లాకుల కేటాయింపుల కుంభకోణం కేసులో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సీబీఐ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించడం చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ( Sonia Gandhi )అభివర్ణించారు. ప్రముఖ  దినపత్రిక లో రాసిన ఎడిటోరియల్ వ్యాసంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో ఓ గొప్ప అర్థశాస్త్రవేత్త, దార్శనికుడిపై ఏళ్ల తరబడి సాగిన రాజకీయ వేధింపులు, కుట్రలకు తెరపడిందని ఆమె పేర్కొన్నారు. తగిన ఆధారాలు లేకుండానే మాజీ ప్రధానిపై తీవ్ర ఆరోపణలు చేసిన విచారణ కోర్టును సుప్రీంకోర్టు తప్పుపట్టిందని, సీబీఐ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదించి కేసును పూర్తిగా మూసివేసిందని గుర్తుచేశారు.

Manmohan Singh Case | ప్రత్యేక కోర్టు ఆదేశాలు రద్దు..

ఈ కేసులో మన్మోహన్ సింగ్‌తో పాటు మరో ఐదుగురిపై ఐపీసీ సెక్షన్లు 120-బి, 409 కింద విచారణ జరపాలంటూ 2015లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. జూలై 29, 2026న వెలువడిన ఈ తీర్పు భారత రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలకమని సోనియా గాంధీ తెలిపారు. కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 2024లో కన్నుమూశారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం ఆయన ప్రామాణికతకు, మచ్చలేని నిజాయితీకి నిదర్శనమని ఆమె కొనియాడారు.

ఇది కూడా చదవండి: PDS Rice Seized | అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం సీజ్

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *