HCU Drug Raid | హెచ్‌యూవీలో డ్రగ్స్ కలకలం.. 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తెలంగాణ ఈగల్ (EAGLE) టీమ్ , పోలీసులు బుధవారం ఉయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: HCU Drug Raid | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తెలంగాణ ఈగల్ (EAGLE) టీమ్ , పోలీసులు బుధవారం ఉయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్యాంపస్‌లో డ్రగ్స్ సేవించడం, విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానిత విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ (Cannabis positive) వచ్చినట్లు తేలడం వర్సిటీలో కలకలం రేపింది.

HCU Drug Raid | అస్సాం నుంచి సరఫరా..

యూనివర్సిటీ పరిధిలో అక్రమంగా మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అస్సాం రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి హెచ్‌యూవీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. క్యాంపస్‌లో ఒక్కో గ్రాము గంజాయిని రూ.500 చొప్పున అమ్ముతున్నట్లు తేలింది. ప్రస్తుతం వర్సిటీ ప్రాంగణంలో ఈగల్ టీమ్ తనిఖీలు కొనసాగుతుండగా, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత తెలియనున్నాయి.

 

ఇది కూడా చదవండి: Mumbai Landslide | ముంబైలో విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు దుర్మరణం..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *