అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | అమెరికా -ఇరాన్ శాంతి ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అమెరికా తమ షరతులకు అంగీకరించే వరకు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేసే ఉంటుందని టెహ్రాన్ పేర్కొంటుండగా.. కీలక జలమార్గం తమ సంపూర్ణ నియంత్రణలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో ద్రవ్యోల్బణ భయాలతో మార్కెట్లు నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి.
Indian Stock Market | ఫ్లాట్ గా ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 109 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిýదొక్కుకోలేక ఇంట్రాడే గరిష్టాలనుంచి 766 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ ఫ్లాట్ గా ప్రారంభమై 208 పాయింట్లు కోల్పోయింది. అయితే చివరి గంటన్నరలో కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పుంజుకుని నష్టాలను గణనీయంగా తగ్గించుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 188 పాయింట్ల నష్టంతో 77,966 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 24,435 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market | టాటా గ్రూప్‌లో అమ్మకాల ఒత్తిడి..
టాటా సన్స్ చైర్మన్ స్థానానికి చంద్రశేఖరన్ రాజీనామా చేయడంతో టాటా గ్రూప్ షేర్లు నష్టపోయాయి. టీసీఎస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్, టాటా స్టీల్ షేర్లు భారీగా పతనమయ్యాయి.
Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,867 కంపెనీలు లాభపడగా 2,462 స్టాక్స్ నష్టపోయాయి. 196 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 172 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 134 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 9 స్టాక్ లాభపడగా.. 21 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎస్బీఐ 1.31 శాతం, ఎయిర్‌టెల్ 1.16 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.56 శాతం, పవర్‌గ్రిడ్ 0.54 శాతం, రిలయన్స్ 0.45 శాతం లాభపడ్డాయి.
Top Losers : టీసీఎస్ 3.17 శాతం, ఎం అండ్ ఎం 1.67 శాతం, టాటా స్టీల్ 1.57 శాతం, ఎల్టీ 1.18 శాతం, ఎటర్నల్ 1.18 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Realme 16X | రియల్మీ నుంచి మరో ఫోన్ విడుదల