Imran Khan Death Rumours | ఇమ్రాన్ ఖాన్ కన్నుమూసినట్లు ప్రచారం.. పాకిస్థాన్‌లో కలకలం రేపుతున్న సోషల్ మీడియా పోస్ట్!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ మృతి చెందినట్లు ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ సయీద్ ఖాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర కలకలం రేపింది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Imran Khan Death Rumours | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ మృతి చెందినట్లు ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ సయీద్ ఖాన్ చేసిన సోషల్ మీడియా (Social Media) పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. ఇమ్రాన్‌ ఖాన్ జైల్లోనే ప్రాణాలు కోల్పోయారని తనకు ముగ్గురు సీనియర్ సైనికాధికారులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వార్తతో పాక్ ప్రజలు, ఆయన పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ఇమ్రాన్‌ను కలిసేందుకు కుటుంబసభ్యులకు అధికారులు అనుమతి నిరాకరించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

Imran Khan Death Rumours | ప్రభుత్వానికి పీటీఐ హెచ్చరిక..

తమ నేత ఇమ్రాన్‌ఖాన్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చేందుకు 20 లక్షల మంది సిద్ధంగా ఉన్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి, పీటీఐ నేత సోహైల్ అఫ్రిది హెచ్చరించారు. ఆ సమయంలో యువత ఆగ్రహాన్ని అణచివేయడానికి దేశ సైన్యం కూడా సరిపోదని ఆయన స్పష్టం చేశారు. ఇమ్రాన్‌ను కలవడానికి కుటుంబసభ్యులకు, వైద్యులకు అనుమతి ఇవ్వకపోతే పెద్దఎత్తున నిరసనలు చేపడతామని పీటీఐ తేల్చిచెప్పింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ వైపు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ ప్రచారాలపై పాకిస్థాన్ ప్రభుత్వం కానీ, జైలు అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇది కూడా చదవండి: Trump Iran Talks | ఇరాన్‌తో చర్చలపై నమ్మకం లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *