Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rain Alert | తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోటు వర్షపాతం కొనసాగుతుందన్నారు.

తెలంగాణ (Telangana)లో వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం సైతం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నిజామాబాద్​, కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట, సిరిసిల్ల, హన్మకొండ, ములుగు, కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్​, భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం, రాత్రి పూట మోస్తరు వాన కురిసే ఛాన్స్​ ఉంది. మిగతా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది.

Rain Alert | వరద తగ్గుముఖం

రాష్ట్రంతో పాటు ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు పడటం లేదు. దీంతో నదులకు వరద తగ్గింది. కృష్ణా, గోదావరి నదులతో పాటు ఇతర నదులకు సైతం వరద రావడం లేదు. దీంతో తెలంగాణలోని జలాశయాలకు స్వల్ప ఇన్​ఫ్లో మాత్రమే వస్తోంది. కృష్ణా నదిపై గల జూరాల ప్రాజెక్ట్​ ఇప్పటికే నిండగా.. శ్రీశైలం జలాశయం సైతం నిండుకుండలా మారింది. గోదావరిపై గల శ్రీరాంసాగర్​ సగం నిండింది. ఎల్లంపల్లి నిండుకుండలా మారింది. శ్రీరామ్​ సాగర్​, నాగర్జున సాగర్​ నిండితే ఈ ఏడాది సాగు, తాగు నీటికి ఢోకా ఉండదు.

ఇది కూడా చదవండి..: ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *