అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ayush Shetty Victory | ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించారు.
ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ షి యుకి (చైనా)పై అద్భుత విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఆయుష్ శెట్టి 21-14, 13-21, 21-19 తేడాతో షి యుకిని ఓడించి తదుపరి దశకు దూసుకెళ్లారు.
Ayush Shetty Victory | మూడో గేమ్‌పై ఉత్కంఠ
తొలి గేమ్‌లో ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన ఆయుష్ 21-14తో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే రెండో గేమ్‌లో షి యుకి పుంజుకుని 21-13తో గెలిచి మ్యాచ్‌ను సమం చేశారు. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌పై ఉత్కంఠ నెలకొంది.
మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోరాడారు. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించిన ఆయుష్ శెట్టి 21-19తో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ నంబర్ వన్, ప్రస్తుత ఛాంపియన్‌పై విజయం సాధించడం ద్వారా ఆయుష్ తన సత్తాను చాటుకున్నారు.
Ayush Shetty Victory | పీవీ సింధు శుభారంభం
ఇక భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా టోర్నీలో శుభారంభం చేశారు. ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌పై వరుస గేముల్లో 21-7, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను సులువుగా ముగించారు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒకే రోజు ఆయుష్ శెట్టి, పీవీ సింధు విజయాలు సాధించడంతో భారత బ్యాడ్మింటన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.