అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Adulterated Ghee | నెయ్యి ఆరోగ్యానికి మంచిది. ధర కూడా అధికంగా ఉంటుంది. అయితే రుచి, ఆరోగ్యం కోసం చాలా మంది నెయ్యిని కొనుగోలు చేస్తారు. దీనిని కూడా కొందరు కల్తీ చేస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో కల్తీ నెయ్యి దందాపై హెచ్ ఫాస్ట్ (H-Fast) అధికారులు ఉక్కుపాదం మోపారు. డీసీపీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షణలో, ఆహార భద్రతా విభాగం సమన్వయంతో, కమిషనర్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన హెచ్-ఫాస్ట్ బృందం హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, అమ్మకాలపై ఒక భారీ ఆపరేషన్ నిర్వహించింది. నెయ్యి తయారీ యూనిట్లు, విక్రయ కేంద్రాలతో సహా 130 సంస్థలను తనిఖీ చేసింది. సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యితో పాటు క్రీమ్, పామాయిల్, వనస్పతి, స్టార్చ్, కృత్రిమ ఫ్లేవర్లతో సహా సంబంధిత ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్థాలను కల్తీ నెయ్యిని తయారు చేయడానికి, విక్రయించడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు.
Adulterated Ghee | ఆలోచించి కొనాలి
హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏది కల్తీ, ఏది నిజమో తెలియని పరిస్థితి నెలకొంది. వినియోగదారులు చౌకగా లభించే లేదా బ్రాండ్ లేని నెయ్యిని కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని అధికారులు సూచించారు. తాజాగా అధికారులు స్వాధీనం చేనసుకున్న పదార్థాలలో సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యి ఉంది.
Adulterated Ghee | ఇలా తయారు చేస్తారు
తయారీదారులు అసలైన నెయ్యి రుచి, సువాసన, రూపాన్ని పోలి ఉండేలా చేయడానికి, పామాయిల్, వనస్పతి, మీగడ తీసిన పాలపొడి ఉపయోగించి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. పిండిపదార్థం వంటి చౌక ప్రత్యామ్నాయాలతో పాటు కృత్రిమ రుచులను కూడా ఉపయోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. కొన్ని ఉత్పత్తులలో 10 నుండి 40 శాతం వరకు కల్తీ పదార్థాలు ఉన్నట్లు సమాచారం. ‘100% స్వచ్ఛమైన నెయ్యి’, ‘ప్రీమియం నెయ్యి’, ‘ఫార్మ్ ఫ్రెష్ నెయ్యి’ మరియు ‘సహజ నెయ్యి’ వంటి లేబుళ్లతో ఉత్పత్తులను ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. బ్యాచ్ నంబర్లు, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ వివరాలు, విశ్లేషణ ధృవపత్రాలు, తయారీ లేదా ప్యాకింగ్ తేదీలు మరియు గడువు లేదా ఉపయోగించాల్సిన తేదీలతో సహా తప్పనిసరి సమాచారం అనేక ప్యాక్‌లపై లేదని అధికారులు తెలిపారు.
Adulterated Ghee | వీటికి సరఫరా
కల్తీ నెయ్యిని పూజ లేదా దీపం నెయ్యిగా అమ్మడంతో పాటు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ల తయారీదారులు, బేకరీలు, క్యాటరర్లు, పాల దుకాణాలు, హోటళ్లు, ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. తయారీ ప్రక్రియలో ఉపయోగించిన పాల మీగడను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక మరియు తమిళనాడులోని సరఫరాదారుల నుండి సేకరించినట్లు అధికారులు కనుగొన్నారు. కల్తీ నెయ్యిని తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నారు.
H-FAST Cracks Down on Adulterated Ghee in Hyderabad — 36 Tonnes Seized
The Hyderabad Food Adulteration Surveillance Team (H-FAST) of the Commissioner’s Task Force, under the supervision of DCP Vaibhav Gaikwad, in coordination with the Food Safety Department, conducted a major… pic.twitter.com/WluJPBUI82
— Hyderabad Food Adulteration Surveillance Team (@HFastHCP) August 18, 2026
దీనిని కూడా చదవండి : Revanth Reddy Social Justice | కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్.. నాది సోషల్ జస్టిస్ : సీఎం రేవంత్‌రెడ్డి