PCC Chief | పీసీసీ చీఫ్​పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం..

పీసీసీ చీఫ్​పై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PCC Chief | పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​పై(Bomma Mahesh Kumar Goud) ఎంపీ అర్వింద్​ (MP arvind)అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్​ పేర్కొన్నారు. జిల్లా యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు విపుల్​ గౌడ్​ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ భవన్​లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

PCC Chief | అర్వింద్​ చేసిందేమి లేదు

పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్ కంటే​ ఎంపీ అర్వింద్​ చిన్నవాడైనప్పటికీ ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని రాంభూపాల్​ పేర్కొన్నారు. అనంతరం విపుల్ గౌడ్ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ ఎన్​ఎస్​యూఐ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు అర్వింద్​ చాలా చిన్నవాడన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఎల్లప్పుడూ జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి అని, అర్వింద్​ పార్లమెంట్​ పరిధిలో చేసిందేమీ లేదన్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తేలేని అసమర్థ ఎంపీ అర్వింద్​ అని విపుల్​ గౌడ్​ విమర్శించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మఠం రేవతి మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్లు నిజామాబాద్​లో తమ స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్​పై బీజేపీ కార్పొరేటర్ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైనది కాదన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎర్రం గంగాధర్, ప్రవీణ్ యాదవ్, పంచారెడ్డి చరణ్, కో ఆప్షన్ మెంబర్ బొబ్బిలి మధురి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ACB Case | అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కేసు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.