అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ashu Reddy Controversy | నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై (Ashu Reddy) ఎన్ఆర్ఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి పేరుతో మోసం చేశారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంపై అషురెడ్డి ఇప్పటికే స్పందించగా, తాజాగా ఆమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడి పలు కీలక విషయాలను వెల్లడించారు.
వెంకటకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 2021లో ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ నుంచి తమకు సంబంధం విషయమై ఫోన్ వచ్చిందని చెప్పారు. ఫోన్‌లో మాట్లాడటానికి బదులుగా నేరుగా ఇంటికి వచ్చి మాట్లాడాలని చెప్పగా, సత్యనారాయణ తన బంధువుతో కలిసి వచ్చి కుటుంబ వివరాలు వెల్లడించారని తెలిపారు. ఆ సమయంలో తమవైపు నుంచి కొంత సమయం తీసుకుని నిర్ణయం చెబుతామని చెప్పినట్లు పేర్కొన్నారు.
Ashu Reddy Controversy | సంబంధం వద్దని చెప్పాం..
ఆ కుటుంబంపై తనకు తెలిసిన పరిచయాల ద్వారా విచారణ చేయించగా కొన్ని అనుమానాస్పద విషయాలు తెలిసినట్లు ఆయన వెల్లడించారు. కాల్‌మనీ కేసులు ఉన్నాయన్న సమాచారం రావడంతో పాటు, అబ్బాయి వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రతికూల వివరాలు వినిపించాయని అన్నారు. ఈ కారణాల వల్లే ఆ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లలేదని, కాకినాడ వెళ్లి మాట్లాడే పరిస్థితి కూడా రాలేదని చెప్పారు.
అప్పటికీ ఆ కుటుంబం తరచూ సంప్రదించడంతో తాము స్పష్టంగా “ఈ సంబంధం వద్దు” అని చెప్పి దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే 2023లో అషురెడ్డి తల్లి సూచనతో మరోసారి ఈ విషయంపై చర్చ వచ్చినట్లు తెలిపారు. తనవైపు నుంచి మళ్లీ విచారణ చేసి సంబంధాన్ని తిరస్కరించానని చెప్పారు. కానీ తర్వాత అబ్బాయి, అషురెడ్డి మధ్య సంప్రదింపులు కొనసాగినట్లు తనకు తెలిసిందన్నారు.
Ashu Reddy Controversy | ఆధారాలు ఉండాలి
ఆరోపణలపై స్పందిస్తూ, ఎవరైనా ఆరోపణలు చేయొచ్చు.. కానీ వాటికి ఆధారాలు ఉండాలి అని వెంకటకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అషురెడ్డి చెల్లి రూ.50 లక్షలు తీసుకుందన్న ఆరోపణలను తాను నమ్మనని స్పష్టం చేశారు. అషురెడ్డి హైదరాబాద్ (Hyderabad)లో ఉంటే తాను విశాఖపట్నం (Visakhapatnam)లో ఉంటానని, కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని తెలిపారు. అషురెడ్డి వ్యక్తిత్వంపై మాట్లాడుతూ, ఆమె చాలా టాలెంటెడ్, అమాయకురాలని అన్నారు.
తాను సినిమాల్లోకి వెళ్లడాన్ని అంతగా ఇష్టపడలేదని, అయితే తల్లి ప్రోత్సాహంతోనే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిందని పేర్కొన్నారు. డబ్బులు, బంగారం తీసుకున్నారన్న ఆరోపణలు అసత్యమని భావిస్తున్నానని తెలిపారు. ఇక ఈ వ్యవహారంపై త్వరలో అషురెడ్డితో కలిసి ప్రెస్‌మీట్ (Press Meet) నిర్వహిస్తామని వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు. తనపై నమోదైన కేసులో తాను నిర్దోషిగా నిరూపించుకుంటానని కూడా స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Mehreen Pirzada Wedding | నటి మెహ్రీన్ అభిమానులకు సర్‌ప్రైజ్.. వ్యాపారవేత్త అర్ష్ ఔలాఖ్‌ను వివాహం చేసుకున్న బ్యూటీ!


[…] […]