Kamareddy Grain Storage Plan | ధాన్యం నిలువ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్​

రాబోయే ఖరీఫ్ సీజన్‌లో సేకరించనున్న ధాన్యానికి ముందుగానే సమగ్ర నిల్వ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Grain Storage Plan | జిల్లాలో (Kamareddy) రాబోయే ఖరీఫ్ సీజన్‌లో సేకరించనున్న ధాన్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సమగ్ర నిల్వ (Kamareddy Paddy Procurement) ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్​లో అధికారులతో సమీక్షించారు.

Kamareddy Grain Storage Plan | మూడు సీజన్లకు సంబంధించి..

కలెక్టర్ గత మూడు సీజన్లకు సంబంధించి మిల్లర్ల నుంచి రావాల్సిన కస్టమ్ మిల్డ్ రైస్ బకాయిలు, ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న నిల్వ పరిస్థితిని కలెక్టర్​ సమీక్షించారు. అక్టోబర్ 2026 చివరి వారం నుంచి కొత్త ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అప్పటిలోగా అవసరమైన నిల్వ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ధాన్యం నిల్వకు అనువైన ప్రభుత్వ, ఖాళీ భూములను గుర్తించి క్యాప్ నిల్వ, సైలో బ్యాగ్ నిల్వ వివరాలను వెంటనే సమర్పించాలని ఆర్‌డీవోలను ఆదేశించారు.

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర సంస్థల వద్ద ఉన్న ఖాళీ గోదాములను ధాన్యం నిల్వకు ముందుగానే సిద్ధం చేయాలని, ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా మరిన్ని నిల్వ కేంద్రాలను గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర గోదాముల సంస్థ అధికారులను కోరారు. డిఫాల్ట్ రైస్ మిల్లుల ప్రాంగణాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్న, జొన్నలను ఖాళీ చేయించేందుకు పెండింగ్‌లో ఉన్న విడుదల ఉత్తర్వులను వేగవంతం చేయాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. గత సీజన్ల కస్టమ్ మిల్డ్ రైస్ బకాయిలు ఉన్న మిల్లర్లు మిల్లింగ్, ధాన్యం డెలివరీ ప్రక్రియను వేగవంతం చేసి కొత్త ధాన్యం రాకకు ముందే మిల్లుల సామర్థ్యాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు తమ ఖాళీ ప్రాంగణాలను ధాన్యం నిల్వకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని, న్యాయపరమైన వివాదాల్లో ఉన్న నిల్వ ప్రాంగణాలకు సంబంధించి అవసరమైన అనుమతులు సత్వరమే పొందేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Kamareddy Grain Storage Plan | ప్రతిశాఖ తమ ఆధీనంలో..

ప్రతి శాఖ తమ ఆధీనంలో ఉన్న ఖాళీ గోదాములు, నిల్వ ప్రాంగణాలు, అందుబాటులో ఉన్న స్థలాల పూర్తి వివరాలను ఆలస్యం చేయకుండా అందించాలని తెలిపారు. అన్ని శాఖల వివరాలను సమీకరించి సమగ్ర జిల్లా ధాన్యం నిల్వ ప్రణాళికను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పై అంశాలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను వారం రోజుల్లోగా సమర్పించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నిల్వ సామర్థ్యం, ధాన్యం సేకరణ ఏర్పాట్లపై శాఖల వారీగా సాధించిన పురోగతిని నిశితంగా పర్యవేక్షిస్తామని అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్ తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి, టీజీఎస్‌సీఎస్‌సీఎల్ జిల్లా మేనేజర్, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా సహకార అధికారి, తెలంగాణ రాష్ట్ర గోదాముల సంస్థ ప్రాంతీయ మేనేజర్ పాల్గొన్నారు.

Kamareddy Grain Storage Plan, Kamareddy Paddy Procurement, Kharif Season, Paddy Storage, Ashish Sangwan, Grain Warehouses, Telangana Agriculture, Kamareddy News

ఇది కూడా చదవండి: Kavitha Ricky Radhan Meeting | కవిత ఇంట్లో విజయ్ జ్యోతిష్యుడు.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *