అక్షరటుడే, నందిపేట్: Nandipet Roads | మండల కేంద్రంలోని రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో మంండల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
Nandipet Roads | ఆర్మూర్, నిజామాబాద్‌కు వెళ్లే రోడ్డు
మండల కేంద్రం నుంచి ఆర్మూర్ (Armoor)కు అలాగే జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఆ గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు మరింత దెబ్బతిని పలుచోట్ల గుంతలు పెద్దవిగా మారాయి. ముఖ్యంగా రాత్రివేళళ్ల గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రధాన రహదారుల గుండానే డొంకేశ్వర్, నందిపేట్ మండల ప్రభుత్వ కార్యాలయాల అధికారులు నిత్యం ప్రయనిస్తుంటారు. వారికి ఈ ఛిద్రమైన రహదారులు కనిపించట్లేదా అని మండలవాసులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేయించి ప్రయాణికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Nandipet Roads | బండ్లు స్కిడ్ అవుతున్నాయి..
– మంద సాయన్న, నందిపేట్
నిత్యం ఈ ప్రధాన రహదారిగుండానే పొలం పనులకు వెళ్తుంటాను. ఈ రోడ్లపై ప్రమాదకరమైన గుంతలు రాత్రి సమయంలో కనిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాము. అనేకసార్లు నా బండి స్కిడ్ అయ్యింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ గుంతల రోడ్డుకు మరమ్మతు చేయాలి.
ఇది కూడా చదవండి..: Cyber Fraud | ఫోన్ పోయిందని నిర్లక్ష్యం.. ఖాతాలోంచి రూ.2.21 లక్షలు మాయం