అక్షరటుడే, బాన్సువాడ: Banswada Bus Service | విద్యార్థుల సమస్యను తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) వెంటనే స్పందించారు. ప్రత్యేక బస్ సర్వీస్‌ను ఏర్పాటు చేయించి శుక్రవారం ప్రారంభించారు.
Banswada Bus Service | ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల విద్యార్థులు..
కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, చించోలి, కిష్టాపూర్, బీర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా పరిసర గ్రామాల నుంచి నిత్యం ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు విద్యార్థులు వెళ్తుంటారు. అయితే బస్సు సర్వీసు లేక విద్యార్థులు సమయానికి కళాశాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ఈనెల 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో విద్యార్థులు తమ సమస్యను వివరించారు. దీంతో వెంటనే స్పందించిన పోచారం, బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Banswada Bus Service | పోచారం ఆదేశాల మేరకు..
ఆయన సూచనల మేరకు బాన్సువాడ నుంచి కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, కిష్టాపూర్, బీర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా మీదుగా డిగ్రీ కళాశాల వరకు ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. ఈ బస్సు సర్వీస్‌ను శుక్రవారం బాన్సువాడ బస్టాండ్‌లో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వయంగా బస్సులో డిగ్రీ కళాశాల వరకు ప్రయాణించారు. విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఉండేలా ఉదయం, సాయంత్రం రెండు వేళల్లో బస్సును నడపాలని డిపో మేనేజర్‌కు సూచించారు. తమ సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన పోచారానికి విద్యార్థినులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nandipet Roads | అధ్వానంగా రహదారులు.. అవస్థల్లో ప్రయాణికులు..