Nandipet Roads | అధ్వానంగా రహదారులు.. అవస్థల్లో ప్రయాణికులు

నందిపేట నుంచి ఆర్మూర్​ వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నందిపేట్​: Nandipet Roads | మండల కేంద్రంలోని రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో మంండల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Nandipet Roads | ఆర్మూర్​, నిజామాబాద్​కు వెళ్లే రోడ్డు

మండల కేంద్రం నుంచి ఆర్మూర్ (Armoor)​కు అలాగే జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఆ గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు మరింత దెబ్బతిని పలుచోట్ల గుంతలు పెద్దవిగా మారాయి. ముఖ్యంగా రాత్రివేళళ్ల గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రధాన రహదారుల గుండానే డొంకేశ్వర్, నందిపేట్ మండల ప్రభుత్వ కార్యాలయాల అధికారులు నిత్యం ప్రయనిస్తుంటారు. వారికి ఈ ఛిద్రమైన రహదారులు కనిపించట్లేదా అని మండలవాసులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేయించి ప్రయాణికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Nandipet Roads | బండ్లు స్కిడ్​ అవుతున్నాయి..

Nandipet Roads

– మంద సాయన్న, నందిపేట్
నిత్యం ఈ ప్రధాన రహదారిగుండానే పొలం పనులకు వెళ్తుంటాను. ఈ రోడ్లపై ప్రమాదకరమైన గుంతలు రాత్రి సమయంలో కనిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాము. అనేకసార్లు నా బండి స్కిడ్ అయ్యింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ గుంతల రోడ్డుకు మరమ్మతు చేయాలి.

ఇది కూడా చదవండి..: Cyber Fraud | ఫోన్ పోయిందని నిర్లక్ష్యం.. ఖాతాలోంచి రూ.2.21 లక్షలు మాయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *