అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaka Movie | మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం కొత్త చిత్రం గ్లింప్స్ విడుదల చేశారు. అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌తో అంచనాలు భారీగా పెరిగాయి.
బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు (Megastar Chiranjeevi) నటిస్తున్నాడు. ఆ సినిమా పేరు తాజాగా చిత్ర బృందం ఖరారు చేసింది. కాకా పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ మరోసారి వింటేజీ లుక్‌తో అదరగొట్టాడు. పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా గ్లింప్స్‌తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లింప్స్‌లో యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో చిరంజీవి అదరగొట్టాడు.
Kaka Movie | తమన్ మ్యూజిక్
మెగాస్టార్ 158వ సినిమా కాకాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గ్లింప్స్ ప్రకారం చిరు ఒక రొయ్యల కంపెనీ నిర్వహిస్తాడు. అయితే చివర్లో గన్స్ బయటకు తీయడంతో మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌తో మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2027 జనవరి 13న సినిమా విడుదల కానుంది. పోయిన సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన మనశంకర వర ప్రసాద్ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సంక్రాంతికి కాకా కేక పెట్టిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
Presenting the WHOLE NEW SIDE of MEGASTAR @Kchirutweets Garu on his birthday💥
TITLE GLIMPSE OUT NOW😎
— https://t.co/Qtc0T6fhcCKAAKA will set THE BLOODY BENCHMARK on the BIG SCREENS this Sankranthi, on JANUARY 13, 2027 🔥#HBDMegastarChiranjeevi
— KVN Productions (@KvnProductions) August 22, 2026
ఇది కూడా చదవండి..: Sowcar Janaki | ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత