అక్షరటుడే, కామారెడ్డి: Employees PRC | ఉద్యోగులకు (Telangana Employees) 51 శాతం ఫిట్మెంట్తో రావాల్సిన పీఆర్సీని (PRC Implementation) తక్షణమే అమలు చేయాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని టీఎన్జీవోస్ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
Employees PRC | పెండింగ్లో ఉన్న డీఏలు..
ఈ సందర్భంగా నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు. ఉద్యోగులకు అత్యంత అవసరమైన హెల్త్ కార్డులను మంజూరు చేసి ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఉద్యోగుల పాలిట పెనుశాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో ఎజెండా అంశాలన్నింటినీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జెండా, కండువాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకుమార్, సహాధ్యక్షుడు చక్రధర్, కోశాధికారి దేవరాజు, ఉపాధ్యక్షులు జె.శ్రవణ్ కుమార్, రాజ్యలక్ష్మి, జాయింట్ సెక్రెటరీలు రమణ కుమార్, రాజారెడ్డి, రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్.సంతోష్ కుమార్, పబ్లిసిటీ సెక్రెటరీ రాజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు, ఆయా డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Sumanth Driver Arrest | మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్