అక్షరటుడే, వెబ్డెస్క్: Heavy Rain Alert | రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. గత వారం రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు.. ఆదివారం తన ప్రతాపం చూపాడు. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
అల్ప పీడన ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున నుంచే ముసురు పెట్టింది. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 27 వరకు వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Heavy Rain Alert | ఆ జిల్లాలకు అలర్ట్
రాష్ట్రంలో రానున్న 72 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడుతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
Heavy Rain Alert | యాలాల్లో అత్యధికం
గత 24 గంటల్లో వికారాబాద్ జిల్లా యాలాల్లో అత్యధికంగా 89.3 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. హైదరాబాద్‌లో కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ 80.5, కామారెడ్డి జిల్లా సర్వాపూర్ 75, పిట్లం 68, వికారాబాద్ జిల్లా తాండూరు 74.3, పుట్టపహాడ్లో 71.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
ఇది కూడా చదవండి..: CM Revanth Reddy | హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి