Indian Students US | అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల దరఖాస్తులు

అమెరికాలో కఠినతరం అవుతున్న ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనల ప్రభావం భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యా కలలపై పడుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Indian Students US | అమెరికాలో కఠినతరం అవుతున్న ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనల ప్రభావం భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యా కలలపై పడుతోంది. అమెరికాలోని 1,100కి పైగా విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కామన్ యాప్’ (Common App) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరంలో యూఎస్ కళాశాలల్లో అండర్‌గ్రాడ్యుయేట్ (UG) ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 15 శాతం తగ్గింది. రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం దరఖాస్తులు పెరిగినప్పటికీ, మార్చి 1 నాటికి అంతర్జాతీయ దరఖాస్తుదారుల సంఖ్య 10 శాతం క్షీణించి చరిత్రలోనే అత్యధిక తగ్గుదలగా నమోదైంది.

Indian Students US | తగ్గుదలకు కారణాలు..

అమెరికాలో విదేశీ విద్యార్థుల నమోదులో భారత్ ఎప్పుడూ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఈ క్షీణత నమోదు కావడానికి పలు విధానపరమైన మార్పులే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు లేదా ఉద్యోగులు అక్కడ గరిష్టంగా కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉండేలా పరిమితి విధించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత లభించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఫీజులపై అనిశ్చితి నెలకొనడం. ఈ నిబంధనల మార్పుల కారణంగా ఫాల్-2026 సెమిస్టర్‌లో అంతర్జాతీయ విద్యార్థుల రిజిస్ట్రేషన్లు సుమారు 1.1 లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి:  Allahabad High Court Hijab | హిజాబ్​పై అలహాబాద్​ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *