HMDA E-Auction | ప్రీమియం భూముల ఈ-వేలానికి HMDA సన్నాహాలు.. టీ హబ్​లో కీలక సమావేశం..పాల్గొన్న డెవలపర్లు, రియల్‌ఎస్టేట్‌ సంస్థలు

నియోపోలీస్‌, గోల్డెన్‌మైల్‌, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లోని భూముల ఈ-వేలానికి సంబంధించి ఈ సమావేశం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: HMDA E-Auction | హైదరాబాద్‌ Hyderabad మహా నగరంలో ప్రీమియం భూముల ఈ-వేలానికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (HMDA) సన్నాహాలు ముమ్మరం చేసింది.

ఇందులో భాగంగా టీ-హబ్‌లో HMDA ఆధ్వర్యంలో ప్రీ-బిడ్‌ సమావేశం నిర్వహించారు. నియోపోలీస్‌, గోల్డెన్‌మైల్‌, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లోని భూముల ఈ-వేలానికి సంబంధించి ఈ సమావేశం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ప్రీ-బిడ్‌ సమావేశానికి ప్రముఖ డెవలపర్లు, రియల్‌ఎస్టేట్‌ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ-వేలం ప్రక్రియ, భూముల వివరాలు, బిడ్డింగ్‌కు సంబంధించిన అంశాలపై పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు.

HMDA E-Auction | 7న సరూర్‌నగర్‌ భూముల వేలం

సరూర్‌నగర్‌లోని 4,356 చదరపు గజాల లేఅవుట్‌ను సెప్టెంబర్‌ 7న ఈ-వేలం వేయనున్నారు. ఈ స్థలంపై ఆసక్తి ఉన్న డెవలపర్లు, పెట్టుబడిదారులు వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది.

HMDA E-Auction | 9న నియోపోలీస్‌, గోల్డెన్‌మైల్‌

నియోపోలీస్‌, గోల్డెన్‌మైల్‌ లేఅవుట్‌లకు సెప్టెంబర్‌ 9న ఈ-వేలం నిర్వహించనున్నారు. నియోపోలీస్‌లో 4.59 ఎకరాలు, గోల్డెన్‌మైల్‌లో 0.70 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించేందుకు HMDA ఏర్పాట్లు చేస్తోంది.

GO 97 Telangana Polytechnic | GO 97పై గందరగోళం..పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆందోళన..పునఃసమీక్షకు కమిటీ ఏర్పాటు

నగరంలోని కీలక ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రీమియం భూములకు మంచి స్పందన వస్తుందని HMDA అధికారులు భావిస్తున్నారు. ప్రీ-బిడ్‌ సమావేశానికి డెవలపర్లు, రియల్‌ఎస్టేట్‌ సంస్థలు, పెట్టుబడిదారులు హాజరుకావడంతో రాబోయే ఈ-వేలంపై ఆసక్తి నెలకొంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *