నిజామాబాద్Indiramma Housing Progress | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలి

Indiramma Housing Progress | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలి

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మరింత పురోగతి సాధించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Indiramma Housing Progress | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (indiramma housing scheme) అమలులో మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) సూచించారు. హైదరాబాద్‌లోని (hyderabad) తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ (Telangana Housing Corporation) భవనంలో ఉమ్మడి జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy), మహమ్మద్ షబ్బీర్ అలీ (Mohammed Shabbir Ali), పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy), ఎమ్మెల్యేలు మదన్​ మోహన్​, లక్ష్మీకాంతారావు, ధన్​పాల్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Indiramma Housing Progress | ఇందిరమ్మ ఇళ్లు.. డబుల్​బెడ్​రూం ఇళ్లపై..

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు, 2 బీహెచ్​కే హౌసింగ్ పథకాల పురోగతి, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం గురించి మంత్రి పొంగులేటి సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలని, అర్హులైన పేదలకు గృహాలు సమయానికి అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతను పాటించాలని, లబ్ధిదారులు వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా తోడ్పాటును అందిస్తూ క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు హౌసింగ్ ఎండీ గౌతమ్​, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Iran Oil | మునిగిపోతున్న నౌకకు ‘డెడ్ ట్యాంకర్’ ఆసరా.. అమెరికా దిగ్బంధనంపై ఇరాన్ రివర్స్ ప్లాన్!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....