Model School Teachers | ప్రభుత్వ తీరుతో ఉపాధ్యాయుల ఇబ్బందులు : హరీశ్​రావు

కాంగ్రెస్​ ప్రభుత్వ తీరుతో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని హరీశ్​రావు అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Model School Teachers | కాంగ్రెస్​ ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డి తీరుతో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని హరీశ్​రావు అన్నారు. టీచర్ల సంఘం నాయకులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు బుధవారం ఆయనను కలిశారు.

2004 తర్వాత సీపీఎస్ విధానంలో నియమితులై, ప్రాణాలు కోల్పోయిన సుమారు 40 మంది మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాల పరిస్థితి ఈ ప్రభుత్వంలో అత్యంత దయనీయంగా, అగమ్యగోచరంగా మారిందని హరీశ్​రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ పొందే పూర్తి అర్హత ఉన్నప్పటికీ, ప్రభుత్వం వాటిని మోడల్ స్కూల్స్‌కు అమలు చేయడం లేదన్నారు. దీంతో ఆ కుటుంబాలు నేడు అనాథలై రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Model School Teachers | ఉద్యోగాలు కల్పించాలి

ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించి వారిని ఆదుకోవాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఈ జీవోలను పూర్తిస్థాయిలో అమలు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న 3000 మంది టీచర్లకు ప్రభుత్వం ఐదు డీఏలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టి ఆర్థికంగా కుంగదీస్తోందన్నారు. వెంటనే డీఏలు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Harish Rao | భూములు కబ్జా చేస్తున్న సీఎం రేవంత్​రెడ్డి : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *