అక్షరటుడే, వెబ్‌డెస్క్: China Manufacturing Superpower | ప్రపంచ తయారీ రంగంలో చైనా China తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2023లో ప్రపంచ తయారీ ఉత్పత్తిలో అత్యధిక వాటా చైనాదే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం డేటా ఆధారంగా రూపొందించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచ తయారీ ఉత్పత్తిలో చైనా 28.9 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది.
చైనా తర్వాత 17.2 శాతం వాటాతో అమెరికా రెండో స్థానంలో ఉంది. జపాన్, జర్మనీ రెండూ చెరో 5.1 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ కొరియా, భారత్ చెరో 2.8 శాతం వాటాతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాయి.
China Manufacturing Superpower | టాప్-10 దేశాల్లో భారత్
2023 ప్రపంచ తయారీ ఉత్పత్తిలో భారత్ వాటా 2.8 శాతంగా నమోదైంది. దీంతో ప్రపంచంలోని ప్రముఖ తయారీ దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది.
Kiran Rijiju Amit Shah | అమిత్ షా ఎప్పుడూ పెల్లెట్ ఫైరింగ్‌కు ఆదేశించలేదు: కిరణ్ రిజిజు
తయారీ రంగాన్ని మరింత విస్తరించేందుకు భారత్ చేపడుతున్న పారిశ్రామిక విధానాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు వంటి చర్యలు భవిష్యత్తులో దేశ తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.
China Manufacturing Superpower | ప్రధాన దేశాల వాటాలు ఇలా..
ప్రపంచ తయారీ ఉత్పత్తిలో చైనా 28.9 శాతం, అమెరికా 17.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జపాన్ 5.1 శాతం, జర్మనీ 5.1 శాతం, దక్షిణ కొరియా 2.8 శాతం, భారత్ 2.8 శాతం వాటాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక మెక్సికో 2.2 శాతం, ఇటలీ 2.1 శాతం, ఫ్రాన్స్ 1.8 శాతం, బ్రెజిల్ 1.8 శాతం వాటాతో టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.