అక్షరటుడే, నందిపేట్: Nandipet Theft Case | నిజామాబాద్ Nizamabad జిల్లా నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల నిఘా, పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అంతర్రాష్ట్ర నేరస్థుడిగా పేర్కొంటున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 10 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పర్భణి ప్రాంతానికి చెందిన షేక్ ఖయ్యుమ్ రఫిక్ బేగ్ అలియాస్ షేక్ ఖయ్యుమ్ షేక్ రఫిక్ (23) నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతగాడు గతంలో మహారాష్ట్రలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్, కర్ణాటకలోని బీదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Nandipet Theft Case | గతంలోనూ నేరచరిత్ర
నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2023లో మహారాష్ట్రలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడి నుంచి నాలుగు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివిధ కేసుల్లో అతడు మూడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా మహారాష్ట్రలోని పర్భణి జిల్లా కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో పిస్టల్ విక్రయానికి సంబంధించిన కేసులో కూడా అతడు ఇప్పటివరకు అరెస్ట్ కాకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Nandipet Theft Case | రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్న పోలీసులు
నందిపేట్ దొంగతనం కేసులో దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు నిందితుడు నిజామాబాద్ వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి, నందిపేట్ ఎస్‌ఐ వినయ్ ఆధ్వర్యంలోని పోలీసులు నవీపేట్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని విచారించగా.. తాను దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి మొత్తం 10 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Nandipet Theft Case | పోలీసులకు ఉన్నతాధికారుల అభినందనలు
కేసును ఛేదించడంలో సమర్థవంతంగా పనిచేసిన ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి, నందిపేట్ ఎస్‌ఐ వినయ్, హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుళ్లు అనీల్, శ్రీనివాస్, షబ్బీర్, మహిపాల్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.
Madan Mohan Rao Attack | ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావుపై దాడి యత్నం.. అరెస్టులపై రాజకీయ రగడ!
అరెస్టు చేసిన నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి గత నేరచరిత్ర, ఇతర కేసుల్లో అతడి ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.