April 28 Gold Prices | త‌గ్గుముఖం ప‌డుతున్న పసిడి ధ‌ర‌.. దేశవ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!

Naresh Chandan
April 28 Gold Prices

అక్షరటుడే, వెబ్‌డెస్క్: April 28 Gold Prices | దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు Silver Prices ఇటీవల తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో రికార్డు స్థాయిలో పెరిగిన ఈ విలువైన లోహాల ధరలు ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేసే వారికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు నిరంతరం తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్‌ 28న కూడా ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.

గత వారం రోజులుగా భారీగా తగ్గిన ధరలు ఒకసారి మాత్రమే స్వల్పంగా పెరిగి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రస్తుతం కొనుగోలు చేయడానికి ఇది అనుకూల సమయమని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

April 28 Gold Prices | ధరల మార్పులకు కారణాలు:

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) చూస్తే.. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, కోల్‌కతా, కేరళలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,700గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,890గా ఉంది.

ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల ధర రూ.1,53,850, 22 క్యారెట్ల ధర రూ.1,41,040గా నమోదైంది. చెన్నైలో మాత్రం ధరలు కొంచెం ఎక్కువగా ఉండి 24 క్యారెట్లకు రూ.1,55,250, 22 క్యారెట్లకు రూ.1,42,310గా ఉన్నాయి. ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళలో వెండి ధర రూ.2,69,900గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో రూ.2,59,900గా ఉంది.

April 28 Gold Prices |

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ Dollar విలువ మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం బంగారం ధరలపై పడుతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడం వల్ల ధరల్లో తరచూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

అదనంగా, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, రవాణా ఖర్చులు వంటి అంశాలు కూడా నగరాల మధ్య ధరల్లో తేడాలకు కారణమవుతున్నాయి. అయితే బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతంలోని జ్యువెలరీ దుకాణంలో తాజా ధరలను తప్పనిసరిగా సరిచూసుకోవడం మంచిది.

Hong Kong Housing Crisis : వరల్డ్ రిచెస్ట్ సిటీలో గృహ సంక్షోభం.. అట్ట పెట్టెల్లో జీవనం.. భారత్‌లోనూ ఇదే పరిస్థితి వస్తుందా?

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *