అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi Uzbekistan Award | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ “ఒలియ్ దరాజలి డస్ట్లిక్”ను మోదీకి అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోవ్ ప్రదానం చేశారు.
ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశంతో కీలక ఒప్పందాన్ని చేసుకున్నారు. దీర్ఘకాలిక యురేనియం సరఫరా ఒప్పందం కుదురుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలిపారు. ఈ చర్య దేశ అణు విద్యుత్ ప్రణాళికలను దీర్ఘకాలం పాటు సజావుగా కొనసాగించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. భారత్, ఉజ్బెకిస్థాన్ మూడు సిస్టర్-సిటీ, సిస్టర్-స్టేట్ ఒప్పందాలను కూడా ఖరారు చేస్తున్నాయన్నారు.
Modi Uzbekistan Award | వ్యూహాత్మక భాగస్వామి
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు మిర్జియోయెవ్ మాట్లాడుతూ.. భారత్ విశ్వాసనీయ భాగస్వామి అని పేర్కొన్నారు. గత సంవత్సరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మొదటిసారిగా 1 బిలియన్ డాలర్ల మార్కును దాటిందని చెప్పారు. ప్రస్తుతం రెండు దేశాలను కలుపుతూ వారానికి 14 ప్రత్యక్ష విమానాలు ఉన్నాయన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో లాల్ బహదూర్ శాస్త్రి సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్, మహాత్మా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ స్టడీస్ రెండూ ముఖ్యమైన పాత్ర పోషించాయని మిర్జియోయెవ్ ప్రస్తావించారు.
#WATCH | Tashkent, Uzbekistan: President Shavkat Mirziyoyev confers the Order of “Oliy Darajali Dustlik,” Uzbekistan’s supreme state award, on Prime Minister Narendra Modi
(Source: ANI/DD) pic.twitter.com/WbHZtBB6ZU
— ANI (@ANI) August 30, 2026
దీనిని కూడా చదవండి : Stalin Security | తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు భద్రత కుదింపు