AR Constable Suicide | ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఏఆర్​ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలోని అంబర్​పేట్​లో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: AR Constable Suicide | హైదరాబాద్ (Hyderabad)​లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఏఆర్​ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడమే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

నగరంలోని అంబర్​పేటలోని తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్న నిభాష్ (25) పెట్లబుర్జులో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన నిభాస్​ తిరుమలనగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేనసుకున్నాడు.

AR Constable Suicide | మిత్రులకు చెప్పి..

తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నిభాష్​ వాట్సాప్​ ద్వారా స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో వారు పోలీసులకు ఫోన్​ చేశారు. అంతేగాకుండా అతడి నివాసానికి వచ్చి చూశారు. అప్పటికే ఏఆర్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: MIM Leader Murder | ఓల్డ్​ సిటీలో ఎంఐఎం నేత హత్య..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *