Onion Heat Relief | ఉల్లిపాయకు అంత పవర్​ ఉందా.. జేబులో పెట్టుకుంటే ఎండల నుంచి ఉపశమనం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Onion Heat Relief | ప్రస్తుతం దేశంలో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల టెంపరేచర్​ రికార్డు అవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అయితే ఎండ నుంచి ఉపశమనం కోసం జేబులో ఉల్లిపాయ వేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.

దేశవ్యాప్తంగా వేడితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. దానిని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ జేబులో ఉల్లిపాయ ఉంచుకోవాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Union Minister Jyotiraditya Scindia) సూచించారు. మధ్యప్రదేశ్​లో ఇటీవల​ ఆయన మాట్లాడారు. ఆధునిక కాలంలో అందరు జేబులో ఫోన్లు పెట్టుకుంటే తాను మాత్రం ఉల్లిపాయ పెట్టుకుంటానని చెప్పారు. ఎండ అధికంగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను ఉల్లిపాయ నియంత్రిస్తుందని ఆయన పేర్కొన్నారున.

Onion Heat Relief | ఏసీ వాడను

జేబులో ఓ ఉల్లిపాయ ఉంటే 51 డిగ్రీల ఎండలోనూ మనకు ఏమీ కాదని చెప్పుకొచ్చారు. తాను కారులో, ఆఫీసులో ఏసీ వాడనని మంత్రి తెలిపారు. ఎండను ఎలా తట్టుకుంటున్నావని తనను ఎవరైనా అడిగితే తనది చంబల్​ చర్మం అని చెబుతానన్నారు. జేబులో ఉల్లిపాయ ఉంచుకుంటే.. వడదెబ్బ దరి చేరదన్నారు.

Onion Heat Relief | ఆయుర్వేదం ప్రకారం..

ఆయుర్వేదం (Ayurveda) ప్రకారం, ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో  సాయ పడుతుందని నమ్ముతారు. అందుకే వేసవి కాలంలో సలాడ్ల రూపంలో ఉల్లిపాయను తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి..: Modi Football Gangtok | సిక్కింలో మోదీ ఫుట్‌బాల్ మజా.. యువతతో కలసి మైదానంలో సందడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *