Sep 02 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 02 Market Analysis | అమెరికా – ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ముడి చమురు(Crude oil) ధరలు బ్యారెల్‌కు 95 డాలర్లు దాటాయి. దీంతోపాటు అంతర్జాతీయ బాండ్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడితో గత సెషన్‌లో వాల్ స్ట్రీట్ నష్టాలతో ముగిసింది.

ఆసియా మార్కెట్లు బుధవారం ఉదయం సైతం నష్టాల బాటలో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) స్వల్ప నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sep 02 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.03 శాతం, ఎస్ అండ్ పీ 0.71 శాతం నష్టపోƒయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.03 శాతం లాభంతో ఉంది.

Sep 02 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.32 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.39 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.11 శాతం నష్టంతో ముగిశాయి.

Sep 02 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.94 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.57 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.34 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.27 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.04 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.02 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.05 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Sep 02 Horoscope | కెరీర్‌లో ఊహించని మలుపు.. ఈ రాశుల వారికి ఇది సువర్ణావకాశం!

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 1,143 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు వరుసగా 16వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,846 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.91 నుంచి 0.89కు తగ్గింది. విక్స్ 11.19 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు బలపడి 94.95 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95.65 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.78 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.81 వద్ద ఉన్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *