Raghav Chadha Voter List | రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్..  ఓటర్ జాబితాలో పేరు గల్లంతు!

రాజ్యసభ సభ్యుడు, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వీడి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన రాఘవ్ చడ్డాకు సంబంధించి ఓ కీలక పరిణామం రాజకీయ దుమారానికి దారితీసింది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raghav Chadha Voter List | రాజ్యసభ సభ్యుడు, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వీడి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన రాఘవ్ చడ్డాకు సంబంధించి ఓ కీలక పరిణామం రాజకీయ దుమారానికి దారితీసింది. పంజాబ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితా నుంచి ఆయన పేరు తొలగిపోవడం సంచలనం సృష్టించింది.

Raghav Chadha Voter List | డ్రాఫ్ట్ లిస్ట్‌లో ‘షిఫ్టెడ్’గా గుర్తింపు

పంజాబ్‌ (Punjab)లో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో రాఘవ్ చడ్డా పేరును ‘షిఫ్టెడ్’ (స్థానికంగా లేని వ్యక్తి) లేదా శాశ్వతంగా వేరే ప్రాంతానికి మారినట్లుగా నమోదు చేశారు. తన ఓటర్ ఐడీ మోహాలీలో రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ, సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ అయిన తన పేరును ఎలా తొలగిస్తారంటూ ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Raghav Chadha Voter List | రాజకీయ కక్షసాధింపే ..

ఈ ఘటనపై రాఘవ్ చడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది కేవలం అధికారుల స్థాయిలో జరిగిన క్లరికల్ పొరపాటు కాదని, తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కావాలని చేశారని ఆరోపించారు. తాను ఆప్ పార్టీని వీడి బీజేపీలో చేరిన అప్పటి నుండి పంజాబ్ ప్రభుత్వం తనపై, పార్టీని వీడిన ఇతర నేతలపై కక్ష కట్టిందని విమర్శించారు. బూత్ స్థాయి అధికారి (BLO) నుంచి డీఈఓ వరకు అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధుల విషయంలో ఈసీ మార్గదర్శకాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని, పంజాబ్ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఆప్ ప్రభుత్వ వ్యక్తిగత ఆస్తి కాదని ఆయన పేర్కొన్నారు.

Raghav Chadha Voter List |స్పందించిన ‘ఆప్’..

రాఘవ్ చడ్డా ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా ఖండించింది. ఓటర్ జాబితా రూపకల్పన, సవరణలు పూర్తిగా ఎన్నికల సంఘం (EC) ఆధ్వర్యంలోనే జరుగుతాయని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది కేవలం డ్రాఫ్ట్ జాబితా మాత్రమేనని, తుది జాబితా అక్టోబర్‌లో విడుదల కానుందని అధికారులు తెలిపారు. అప్పటివరకు అందుబాటులో ఉన్న క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ (Claims and Objections) ప్రక్రియ ద్వారా తప్పులను సరిదిద్దుకునే వెసులుబాటు ఉందని, నిబంధనల ప్రకారం తన పేరును తిరిగి నమోదు చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాఘవ్ చడ్డా వెల్లడించారు.

ఇది కూడా చదవండి..: ED Drug Raids | డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈడీ సర్జికల్ స్ట్రైక్.. దక్షిణాదిలో ఏకకాలంలో 30 చోట్ల భారీ సోదాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *