CM Revanth Reddy | దేశభక్తిలో అమిత్‌ షా, మోదీకి ఒవైసీ తక్కువేమీ కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

దేశభక్తిలో అసదుద్దీన్​ ఒవైసీ ప్రధాని మోదీ, అమిత్​ షా కంటే తక్కువేమి కాదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. రూ.620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల మేర దీనిని నిర్మించారు.

బ్రిడ్జి ప్రారంభం అనంతరం సీఎం మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ, MIM దేశానికి వ్యతిరేకమని కొందరు దుష్ర్పచారం చేశారన్నారు. దేశభక్తిలో అమిత్‌ షా, మోదీ (Modi)కి అసద్‌ తక్కువేమీ కాదన్నారు. పాతబస్తీలో సోదరీమణులు లాయర్‌, ఇంజనీర్‌, డాక్టర్లు కావాలని ఆయన ఆకాంక్షించారు. చదువు కోసం ఖర్చు చేయడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని, చదువుకుంటేనే అందరికీ గుర్తింపు ఉంటుందన్నారు.

CM Revanth Reddy | ఒక్క రూపాయి ఇవ్వలేదు

సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జికి గత ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టిందని రేవంత్​ రెడ్డి అన్నారు. అయితే ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. తాను సీఎం అయ్యాక.. అక్బర్, అసదుద్దీన్‌తో ఓల్డ్ సిటీ అభివృద్ధిపై చర్చించానని తెలిపారు. ఇన్నేళ్లలో ఎంతమంది సీఎంలు ఓల్డ్​ సిటీకి వచ్చారని ఆయన ప్రశ్నించారు. తాను తప్ప పాతబస్తీ గల్లీల్లోకి ఇంకెవరు రాలేదన్నారు. ఓల్డ్‌సిటీ అభివృద్ధి కోసం అసద్‌ భాయ్‌ ఏం చెప్పినా.. వెంటనే మంజూరు చేయాలని GHMC కమిషనర్‌ను ఆయన ఆదేశించారు.

CM Revanth Reddy | అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం

అభివృద్ధి చేయడం కోసం తాము ఆలోచిస్తున్నామని సీఎం అన్నారు. విపక్షాలు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ లక్ష్యమన్నారు.

దీనిని కూడా చదవండి : ACB Raids | 5 ఇళ్లు, 8 ప్లాట్లు.. టౌన్ ప్లానింగ్​ ఆఫీసర్​ అక్రమాస్తులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *