Balkonda Congress | కాంగ్రెస్​ ప్రభుత్వానిది జనరంజకమైన పాలన : ముత్యాల సునీల్​కుమార్​

కాంగ్రెస్​ ప్రభుత్వానిది జనరంజకమైన పాలన అని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్​కుమార్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాల్కొండ: Balkonda Congress | కాంగ్రెస్​ ప్రభుత్వానిది జనరంజకమైన పాలన అని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్​కుమార్​ (Muthyala Sunil Kumar) అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలన సందర్భంగా బాల్కొండ (Balkonda) మండల కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

Balkonda Congress |  స్వేచ్ఛాయుత పాలన అందుతోంది

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛాయుత పాలన అందుతోందని ముత్యాల సునీల్​ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో నియంతృత్వ ధోరణి కొనసాగిందని విమర్శించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై కూడా నాయకులు విమర్శలు చేశారు. మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం మహాలక్ష్మి, మహిళా శక్తి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

Balkonda Congress | ఏకకాలంలో రూ.22వేల కోట్ల రుణమాఫీ

రైతుల కోసం ఏకకాలంలో రూ.22 వేల కోట్ల రుణమాఫీతో పాటు సన్న వడ్లకు ప్రతి ఏడాది రూ.500 బోనస్ అందిస్తున్నామని నాయకులు తెలిపారు. యువత కోసం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, నైపుణ్య శిక్షణ, జాబ్ మేళాలు, రాజీవ్ యువ వికాసం, క్రీడా అవకాశాలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. విద్య, నైపుణ్యం, ఉద్యోగం, స్వయం ఉపాధి, క్రీడలు, నాయకత్వ అభివృద్ధి రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తూ యువ తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అంశాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Raghav Chadha Voter List | రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్..  ఓటర్ జాబితాలో పేరు గల్లంతు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *