Liquor Deaths | మధ్యప్రదేశ్​లో దారుణం.. మద్యం తాగి 12 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో 12 మంది మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Liquor Deaths | మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని సాగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విషపూరితమైన మద్యం తాగడంతో 12 మంది మరణించగా, మరో 10 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

పలువురు మద్యం తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తలనొప్పి లేదా జ్వరం వంటి లక్షణాలతో బాధపడ్డారు. దీంతో ఆస్పత్రులకు తరలించగా.. ఇప్పటికే 12 మంది చనిపోయారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య సహాయం పొందాలని అధికారులు కోరారు. కాగా బాంబే విస్కీ పేరుతో విక్రయిస్తున్న నకిలీ మద్యం బ్రాండ్ గురించి ఒక మద్యం కాంట్రాక్టర్ ఇటీవల ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. అయినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా కల్తీ మద్యం తాగి 12 మంది చనిపోవడం గమనార్హం.

Liquor Deaths | విచారణ ప్రారంభం

ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ గ్రామాల్లో వైద్య పరీక్షలు చేపట్టారు. మద్యం దుకాణాలను మూసివేశారు. బాధితులు సేవించినట్లు భావిస్తున్న మద్యం రకం, మరణాలకు దారితీసిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదికలు అందిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (CM Mohan Yadav) విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత మంత్రి, అధికారులను వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించాలన్నారు.

దీనిని కూడా చదవండి : Greece F-4 Crash | ఎయిర్ షోలో కూలిన ఎఫ్-4 ఫాంటమ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *