India Population Clock | రాకెట్ వేగంతో పెరుగుతున్న జనాభా.. ఎయిమ్స్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ సంచలనం

భారతదేశంలో శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అద్దం పడుతూ ప్రముఖ వైద్య విద్యాసంస్థ ‘ఎయిమ్స్’ (AIIMS) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ పాపులేషన్ క్లాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: India Population Clock | భారతదేశంలో శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అద్దం పడుతూ ప్రముఖ వైద్య విద్యాసంస్థ ‘ఎయిమ్స్’ (AIIMS) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ పాపులేషన్ క్లాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ డిజిటల్ స్క్రీన్‌పై దేశ జనాభా క్షణక్షణానికీ ఎలా మారుతుందో ‘లైవ్ కౌంటింగ్’ ద్వారా చాలా స్పష్టంగా చూపిస్తున్నారు.

India Population Clock | దూసుకుపోతున్న జనాభా..

సెకను సెకనుకు డిజిటల్ నెంబర్లు పరుగులు పెడుతూ భారత్ జనాభా ఏకంగా 147 కోట్లను (147,92,39,020) దాటేసినట్లు చూపిస్తున్న దృశ్యాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. దేశంలో జనన, మరణాల రేటును శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

India Population Clock | నెటిజన్ల ఆందోళన..

కేవలం ఒక్క సెకనులో జనాభా అంకెలు వేగంగా మారిపోతుండటం చూసి నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “ఒకవైపు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే.. మరోవైపు జనాభా పెరుగుదల రాకెట్ వేగంతో దూసుకుపోతోంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పెరుగుతున్న ఈ జనాభాకు తగినట్లుగా భవిష్యత్తులో ఉద్యోగాలు, వైద్య సేవలు, మౌలిక వసతులు, నివాస సదుపాయాలను కల్పించడం ఎంత పెద్ద సవాలుగా మారనుందో ఈ డిజిటల్ గడియారం హెచ్చరిస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ జనాభా తీరు , కుటుంబ నియంత్రణపై ప్రజల్లో మరింత విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ లైవ్ బోర్డు విజువల్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి:  Rajasthan Heavy Rains | రాజస్థాన్​లో దంచికొడుతున్న వానలు.. భారీగా ఆస్తి నష్టం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *