జాతీయంPetrol Price Rumors | వదంతులు నమ్మొద్దు.. పెట్రోల్ ధరలపై కేంద్రం క్లారిటీ

Petrol Price Rumors | వదంతులు నమ్మొద్దు.. పెట్రోల్ ధరలపై కేంద్రం క్లారిటీ

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Petrol Price Rumors | పశ్చిమ బెంగాల్ ఎన్నికల (Bengal Elections) అనంతరం ఇంధన ధరలు భారీగా పెరుగుతాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. పెట్రోల్, డీజిల్ (Diesel) ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది.

పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ (Sujatha Sharma) మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇంధన నిల్వలకు సంబంధించి ఎలాంటి కొరత లేదని భరోసా ఇచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్‌లో పెట్రోల్, డీజిల్ నుంచి ఎల్పీజీ (LPG), విమాన ఇంధనం వరకు అన్నీ తగినంత స్థాయిలో ఉన్నాయని తెలిపారు.

Petrol Price Rumors | కృత్రిమ  కొరత

ధరలు పెరుగుతాయనే భయంతో కొందరు ముందస్తుగా ఇంధనాన్ని నిల్వ చేసుకుంటున్నారని, దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. “ధరల పెంపుపై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దు. అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి ఆందోళన చెందవద్దు” అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Petrol Price Rumors | సరఫరా జరిగేలా చర్యలు

రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పెట్రోల్ బంకులకు నిరంతరాయంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం పేర్కొంది. రిటైల్ అవుట్‌లెట్లలో ఇంధన లభ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సుజాత శర్మ వెల్లడించారు. కాగా ఈ ఈ నెల 29న బెంగాల్​లో రెండో దశ ఎన్నికలు ముగియనున్నాయి. ఎన్నికల తర్వాత పెట్రోల్​, డీజిల్ ధరలు పెరుగుతాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పుకార్లను కేంద్రం తాజాగా కొట్టిపారేసింది.

ఇది కూడా చదవండి : Odisha Bank Incident | సోదరి అస్థిపంజరంతో బ్యాంక్​కు వెళ్లిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....