అక్షరటుడే వెబ్‌డెస్క్: ABHFL Nagole Branch | దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించే ప్రణాళికలో భాగంగా ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ‘ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ (ABHFL) హైదరాబాద్‌లోని నాగోల్‌లో కొత్త శాఖను ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్ ఏర్పాటుతో తెలంగాణలో ( Telangana )సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించగా, మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 12కి చేరింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఉనికిని చాటుకోవడంతో పాటు కస్టమర్లకు మరింత చేరువ కావడమే ఈ విస్తరణ ఉద్దేశమని సంస్థ పేర్కొంది.
ABHFL Nagole Branch | ఎదుగుతున్న నాగోల్ కారిడార్..
మెరుగైన రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు, ప్రధాన వాణిజ్య, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటంతో ఉప్పల్-నాగోల్ ప్రాంతం హైదరాబాద్‌లో ప్రముఖ రెసిడెన్షియల్ హబ్‌గా మారుతోంది. ఇక్కడ విద్య, రవాణా సౌకర్యాలతో పాటు మధ్యతరగతి ఉద్యోగులు, కుటుంబాలు నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుండటంతో గృహ నిర్మాణ రంగం జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతంలో ఇళ్లకు పెరిగిపోతున్న డిమాండ్‌కు తగినట్లుగా.. కస్టమర్ల సొంతింటి కలను సాకారం చేయడానికి ఏబీహెచ్ఎఫ్ఎల్ ఈ కొత్త శాఖ ద్వారా మెరుగైన గృహ రుణ పరిష్కారాలను అందించనుంది.
ABHFL Nagole Branch | లోన్ సర్వీసులు..
వివిధ వర్గాల ప్రజల అవసరాలను తీర్చేందుకు సంస్థ విస్తృత శ్రేణి రుణాలను అందిస్తోంది. ఉద్యోగులు, స్వయం ఉపాధి నిపుణులు, పెరుగుతున్న ఆదాయ వర్గాల కోసం అఫర్డబుల్ హౌసింగ్, ప్రైమ్ హౌసింగ్, కన్‌స్ట్రక్షన్ ఫైనాన్స్ , ఆస్తులపై రుణాలు (Loan Against Property) వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. బలమైన డిజిటల్ టెక్నాలజీ సపోర్ట్‌తో దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తూ, వేగవంతమైన అనుమతులు ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ABHFL Nagole Branch | స్పాట్ లోన్ ఆఫర్లు ఇవే..
నాగోల్ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు: జీరో లాగిన్ ఫీజుతో లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. రూ. 50 లక్షల వరకు అక్కడికక్కడే రుణ మంజూరు (స్పాట్ సాంక్షన్) సదుపాయం కల్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ విస్తరణపై ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ & సీఈవో పంకజ్ గాడ్గిల్ మాట్లాడుతూ.. తెలంగాణ తమకు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రోత్ మార్కెట్ అని తెలిపారు. కస్టమర్లతో బంధాన్ని మరింత బలపరచుకోవడానికి, వారి సొంతింటి కలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా నెరవేర్చేందుకు ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నామని ఆయన వెల్లడించారు. బాధ్యతాయుతమైన రుణాల మంజూరు, ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: MRI Scanning | మరో 9 ఆస్పత్రుల్లో ఎంఆర్ఐ సేవలు : మంత్రి రాజనర్సింహ