Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Forecast | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడన (LPA) ప్రభావం తొలగడంతో భారీ వర్షాలు పడవని పేర్కొన్నారు.

అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. పలు చోట్లు ముసురు పెట్టింది. నేడు రాత్రి వరకు అక్కడక్కడా మాత్రమే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్ప పీడన ప్రభావం తొలగిపోయిందని అధికారులు తెలిపారు.

Rain Forecast | ఉరుములతో కూడిన వానలు

మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లలో ఆదివారం రాత్రి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా హైదరాబాద్​ నగరంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. బాచుపల్లిలో అత్యధికంగా 50.5 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. నీరు లేక ఎండుతున్న పంటలకు వానలు మేలు చేశాయని రైతులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి : Extramarital Dating Apps | వివాహేతర సంబంధాల యాప్‌ల వినియోగంలో హైదరాబాద్‌ టాప్‌–5లో..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *