అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Mail Ballot | మిడ్ టర్మ్ ఎన్నికల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ మెయిల్ బ్యాలెట్ ఆంక్షలను తిరస్కరించింది. రాష్ట్రాలు పాత విధానంలోనే మెయిల్ బ్యాలెట్లు పంపేందుకు అనుమతి ఇచ్చింది.
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగుతున్నాయి. ఆ క్రమంలో మెయిల్ బ్యాలెట్‌పై ట్రంప్ ఆంక్షలు విధించారు. దీనిపై కొందరు ఆ దేశ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. మధ్యంతర ఎన్నికలకు ఈ ఆంక్షలు అమలులోకి రాకూడదని జస్టిస్ బ్రెట్ కావనా పేర్కొన్నారు. అయితే తర్వాత తాను ట్రంప్ పరిపాలనకు అనుకూలంగా తీర్పు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
Trump Mail Ballot | తక్కువ సమయం ఉండటంతో..
నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో మెయిల్ బ్యాలెట్‌పై ట్రంప్ పలు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రాలు ఒకే విధమైన కవరు శైలిని అవలంబించి, అర్హులైన ఓటర్ల జాబితాలను ఒక ఆన్లైన్ పోర్టల్‌కు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనలను పాటించని రాష్ట్రాలకు బ్యాలెట్లను పంపిణీ చేయడానికి తపాలా సంస్థ నిరాకరించవచ్చని పేర్కొన్నారు. దేశంలో దాదాపు మూడింట ఒక వంతు మంది మెయిల్ ద్వారా ఓటు వేస్తారు. అయితే ఎన్నికలకు తక్కువ సమయంలో ఉండటంతో పూర్తిస్థాయి సంస్కరణలను చేపట్టడానికి మార్గం లేదని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ దీనిపై కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి..: Iran UAE Relations | ఇరాన్, యూఏఈల మధ్య కొత్త అధ్యాయం