అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran UAE Relations | పశ్చిమాసియాలో యుద్ధంతో విభేదాలు ఉన్నప్పటికీ, ఇరాన్– యూఏఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాయి. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు ఆదివారం పేర్కొన్నారు.
ఇరాన్–అమెరికా యుద్ధం తర్వాత.. టెహ్రాన్ యూఏఈలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ తరుణంలో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ శనివారం భేటీ అయ్యారు. తాజాగా ఆదివారనం ఆయన మేము అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌తో నిర్మాణాత్మక చర్చలు జరిపామన్నారు.
Iran UAE Relations | గతాన్ని పక్కనపెట్టి..
గతాన్ని పక్కనపెట్టి, భవిష్యత్తు వైపు చూస్తూ, దానిని కలిసి నిర్మించుకోవాలని అంగీకరించాము అని ఆయన తెలిపారు. ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి భవిష్యత్తు గురించి చర్చించడానికి గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో సమావేశమైతే తనకు ‘అభ్యంతరం లేదని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం అన్నారు. మధ్యప్రాచ్యంలో భద్రతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సోమవారం ఒమన్ వేదికగా గల్ఫ్ దేశాలు మరియు ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి.
Iran UAE Relations | ఆ దేశాలతో సమస్య లేదు
యూఏఈ, ఇతర ప్రాంతీయ దేశాలతో ఇరాన్‌కు ఎటువంటి సమస్య లేదని పెజెష్కియన్ స్పష్టం చేశారు. అయితే గల్ఫ్ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. యుద్ధ సమయంలో ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికా ఈ స్థావరాలను ఉపయోగించిందని ఆరోపించారు. స్నేహపూర్వక దేశాలు తమ భూభాగాన్ని ఇతర పొరుగు దేశాలపై దాడి చేయడానికి అనుమతించకూడదని ఇరాన్ నాయకుడు అన్నారు.
దీనిని కూడా చదవండి : Vinayaka Chavithi 2026 | గణపతి ప్రతిష్ఠాపనకు బెస్ట్ టైమింగ్ .. పూజా ముహూర్తాలు, విధానం పూర్తి వివరాలు ఇవే!