అక్షరటుడే వెబ్డెస్క్: Russia US Visa Row | న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు (UNGA) ప్రారంభమైన వేళ, రష్యాకు అమెరికా షాకిచ్చింది. రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ అలిమోవ్కు అమెరికా వీసా నిరాకరించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని మాస్కో తీవ్రంగా ఖండిస్తూ ‘అన్ఫ్రెండ్లీ యాక్ట్’గా అభివర్ణించింది. అయితే, అలిమోవ్కు వీసా తిరస్కరణకు అసలు కారణం ఏమిటనే దానిపై వాషింగ్టన్ ( Washington ) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Russia US Visa Row | ఐరాస నిబంధనల వాదన..
రష్యా విదేశాంగ శాఖలో ఐక్యరాజ్యసమితికి సంబంధించిన కీలక వ్యవహారాలను అలిమోవ్ పర్యవేక్షిస్తున్నారు. యూఎన్జీఏ సమావేశాల్లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ నేతృత్వంలోని అధికారిక ప్రతినిధి బృందంలో ఆయన పాల్గొనాల్సి ఉంది.
అయితే, ఐరాస ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉన్నందున.. అధికారిక UN కార్యక్రమాలకు హాజరయ్యే సభ్య దేశాల ప్రతినిధులకు ప్రవేశం కల్పించే బాధ్యత ఆతిథ్య దేశమైన అమెరికాపై ఉంటుందని మాస్కో వాదిస్తోంది. అధికారిక కార్యకలాపాల కోసం ప్రయాణించే రష్యా అధికారులపై వివక్ష చూపరాదని, అనవసర కారణాలతో వీసాలు నిరాకరించడం సరికాదని రష్యా విదేశాంగ శాఖ అంతర్జాతీయ సంస్థల విభాగం డైరెక్టర్ కిరిల్ లాగ్వినోవ్ పేర్కొన్నారు.
Russia US Visa Row | తప్పని వీసా కష్టాలు..
అలెగ్జాండర్ అలిమోవ్కు అమెరికా వీసా నిరాకరించడం ఇదే మొదటిసారి కాదని రష్యా స్పష్టం చేసింది. 2026 మేలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి హాజరయ్యే సమయంలోనూ ఆయనకు వీసా లభించలేదని గుర్తుచేశారు. ఈ తాజా పరిణామంతో ఐరాస సమావేశాలకు రష్యా అధికారుల ప్రవేశంపై మరోసారి దౌత్యపరమైన చర్చ మొదలైంది. వీసా సమస్యలపై రష్యాతో పాటు ఇతర ప్రతినిధుల అంశాలపై అమెరికాతో చర్చలు కొనసాగుతున్నట్లు ఐరాస వర్గాలు గతంలో పేర్కొన్నాయి.
Russia US Visa Row | ఆంక్షలు లేవు..
ఈ వీసా నిరాకరణ కేవలం అలెగ్జాండర్ అలిమోవ్కే పరిమితమైంది. రష్యా మొత్తం ప్రతినిధి బృందాన్ని అమెరికా UNGAలో పాల్గొనకుండా అడ్డుకుందని చెప్పడానికి ఎలాంటి సమాచారం లేదు. విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో పాటు మిగతా రష్యా ప్రతినిధులు సమావేశాలకు హాజరవుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఆంక్షలు, దౌత్యపరమైన పరిమితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ.. ఈ తాజా వీసా వివాదం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: BIS Screen Protectors | స్మార్ట్ఫోన్ యూజర్లకు అలర్ట్.. స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిబంధన